Powered By Blogger

Tuesday, September 6, 2011

స్మార్ట్ గా వుండడమంటే....

ఈ కార్పొరేట్ కల్చర్ పెరిగాక,గ్రూప్ లో పనిచేయక తప్పని పరిస్థితి.అందులోనూ రకరకాల మనుషులు.మనుషులు ఎప్పుడూ ఒకెరకమే..తిన్నామా,పడుకున్నమా, తెల్లరిందా టైపే..కాని ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ లో పరిగెత్తక తప్పని పరిస్థితి.నా మానాన నేను పరిగెడతానంటే కుదరదు.పక్కవాడిని తోసి పరిగెట్టాలి.కాని ఆ తోయడం ఎల వుండాలంటే కాకతాళీయం గా నా చెయ్యొ,కాలో తగిలింది అంతే అన్నట్టుగా వుండాలి.లేదు,కాదు నువ్వు కావాలని యేదొ అడ్డుపెట్టావ్ అందుకే నే పడిపొయానని గొడవ పెట్టుకున్నవా? మటాష్ ,అందరూ నిన్నే చూస్తారు(పరుగెత్తడం మరిచిపోయి కూడ,వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారో వాళ్ళకి తెలియకపోయినా),నీదే తప్పంటారు, నలుగురితో కలవడం రాదంటారు(నీ వెనకాలె వచ్చిన పనికిమాలిన వెధవ కూడ నీకు సజెషన్స్ ఇస్తాడు)పాపం అందరూ నిన్ను దూరం పెడతారు(వాళ్ళ లాగ నీకు అవతలి వాళ్ళని ఎలా ముంచాలో తెలియదు కాబట్టి),ఆ సరికి నువ్వెదో పంచమహాపాతకాల తరువాత  ఆరో మహాపాతకం చెసినట్టు చూస్తారు. మనకేమొ మనమేమి తప్పు చేసామో తెలియని అయోమయం.కాబట్టి కార్పొరేట్ కల్చర్ లో(నేను మాటిమాటికీ కార్పొరేట్ అంటున్నానని ఇదేదొ సాప్ట్ వేర్    గొడవ అనుకోవద్దు ,ఇప్పుడు బట్టల షాపు లో కూడా ఈ కల్చర్ చూడచ్చు.) నలుగురిలో కలవడం అంటే పక్కవాడిని పళ్ళూడిపోయేలా కొట్టాలనిపించినా మనం పళ్ళికిలిస్తూకనబడ్డం. అవతలి వాడికి షేక్ హేండ్ ఇస్తూనే వాడి ఎముకలో సున్నం లేకుండా నలిపేయడం. అందుకే బద్దెన గారు ఎప్పుడో చెప్పారు(ఆయన ఎవరు అని నన్ను అడగకండి,నేను మాటిమాటికీ ఆత్మహత్య చెసుకోలేను)నొప్పించక,తానొవ్వక తప్పించుకుతిరుగువాడు ధన్యుడు సుమతి అని(సరిగ్గ మా బాస్ లాగ). కా బట్టి,కార్పొరేట్ కల్చర్ జిందాబాద్,ప్రపంచమంతా పనికిమాలిన వెధవలు అనుకునే అమెరికన్స్ జిందాబాద్.వుంటాను మరి,నాక్కూడా కమ్యూనికేషన్ కోర్సులకు వెళ్ళే టైం అయింది!

2 comments:

  1. బద్దెన గురించి మీరు చెప్పింది బాగుంది. వారు ఎవరో తెలియకపోతే చెప్పని తల్లిదండ్రుల తప్పు.
    నవతరంగం సిరివెన్నెల వ్యాసం నుంచి మీ బ్లాగు కి వచ్చాను. బాగుంది. కాని కాసేపు చదివితే కళ్ళముందు నలుపు తెలుపు గీతలు అలా గింగిరాలు తిరుగుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్, ఫాంట్ రంగు కొంచెం మారిస్తే నా కళ్ళు మీకు థాంక్స్ చెబుతాయి.
    అమెరికా ని కొంచెం తిట్టేసారండి. వాళ్లకి ముందు "ప్రపంచం" అనేది ఒకటి ఉంది అని తెలియదు. చాలా ఏళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి చెబుతున్నా. అమెరికాయే ప్రపంచం అని అనుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఐతే, అలా అనుకోని వాళ్ళు మాత్రం చాలా అణకువ తో ఉండడం నేను చూసాను. అందులోనూ ఈ నాటి ఈ ఆర్ధిక పరిస్థితుల్లో వాళ్ళందరికీ అమెరికాయే కాకుండా ఇంకా అనేక దేశాలు ఉన్నాయి అన్న విషయం రోజూ గుర్తు వస్తోంది.

    ReplyDelete
  2. మీరు చెప్పింది కరెక్టే, ఫాంట్ మార్చడానికి ట్రై చేస్తాను,,అమెరికన్లకి కాళ్ళ కింద నేల వుందని ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల తెలుస్తోంది.

    ReplyDelete