Powered By Blogger

Wednesday, September 7, 2011

"కోతి మరియు దాని తోక"

అనగనగా ఒక అడవి.అడవన్నాక కోతులుంటాయి కదా.కోతులూ వుంతాయి,కొండముచ్చులూ వుంటాయి,చింపాజీ లూ వుంటాయి.ఇలా వున్న ఆ అడవిలోకి ఒకసారి పక్క అడవినుంచి ఓ కోతి వచ్చింది.ఈ అడవిలోని కోతుల్ని చూసి అది చాలా బాధపడిపోయింది.ఈర్ష్య పడిపోయింది.దేవుడు దానికేదొ పెద్ద అపకారం చేసినట్టు ఫీలై పోయింది.ఇంతకీ దాని అసూయకి ,బాధకి కారణం ఏమిటంటే ఈ అడవిలో కోతులకి తోకలున్నాయి,దీనికి లేదు.అందులోనూ అవి మామూలు తోకలా పెద్ద పెద్ద తోకలు ,బలమైన తోకలు,ఇంపైన తోకలు.దెబ్బతో దానికి దేవుడి మీద చాల కోపం వచ్చింది నిలబెట్టి కడిగేయలనుకుంది,దేవుడున్నడా అనుకుంది వుంటె చూస్తున్నాడా అనుకుంది(ఈ దేవుడు డైలాగులన్ని నావి కాదందోయ్,మీకు ఈ డౌటు వచ్చిందంటే మీరు ఈ మధ్య తెలుగు పేపర్లు చదవడం లేదనే లెక్క!) కాని దేవుడు,  మిడిల్ క్లాస్ మనిషికి సొంతింటి కల లాగా అందని విషయం కాబట్టి ఆ ప్రయత్నం మానుకుని తనే సొంతం గా ఆలోచించడం మొదలెట్టింది.ఎంతయినా కోతి తెలివితేటలు కదా! అడవంతా కలియతిరిగి కొన్ని ఆకులు మరికొన్ని వేళ్ళూ తెచ్చుకుని తనే ఒక తోక అల్లుకుంది.తుమ్మ జిగురో మరి ఇంకోటేదో తెచ్చుకుని(మరదే! అలా చూస్తారేంటి,అడవిలో ఫెవికాల్ దొరకుద్దా?) దాని వెనకాల అతికించుకుంది (వెనకాలంటె  ఎక్కడో మీకు తెలుసు ఎందుకంటే మీరు కూడా ఆంధ్ర ప్రదేశ్ జనాల లాగా ఇంటెలిజెంట్స్ అని నాకు తెలుసు.చంద్రబాబు గారి ఆస్తులు 39 కోట్లంటె తలక్కయలు వూపేసిన వాళ్ళూ ఇంటెలిగెంట్స్ కాక మరేంటి).సున్నమో, బూడిదో తెచ్చుకుని తోకకు పాముకుని అదినిజమైన తోకలా కనబడ్డానికి ట్రై చేసింది.దానికి వచ్చిన కొత్త తోకని చూసుకుని మురిసిపోయింది.ఊర్లో వీర విహారానికి బయల్దేరింది.కనబడిన ప్రతీ దానికి దీని తోకని చూపించడం మొదలెట్టింది.నిజం గా తోకలున్న కోతులు ఎప్పటిలానె మాములుగా వుంటె ఇదిమాత్రం దాని ముఖానికన్న ముందు గా దాని తోకని చూపించుకుంటూ తిరగసాగింది.కాని అది నేచురల్ గా వున్న తోక కాదు కబట్టి,అది కూడ అంతే నేచురల్ గా నాలుగు కోతుల మధ్య ఇది గంతులేస్తున్నప్పుడు వూడిపోయింది.దాంతో ఈ కోతికి మొహం చెల్లలేదు. ఎక్కదికైనా ఈ తోకలకి దూరం గా వెళ్ళీపోయి ప్రశాంతం గా బతకాలనుకుంది ఫ్యాక్షన్ సినిమాలో హీరో లాగ.కాని తోక వుంటే వుండే మజా నే వేరు.దానికి అడవిలో దొరికే గౌరవమే వేరు.అందుకే దీనికి పరిష్కారం  ఒక్కతే అనుకుని ఎక్కడపడితే అక్కడ చెట్టుల మీద ,పుట్టల మీదా "నాకు తోక వుంది" అని రాయడం మొదలుపెట్టింది. మిగిలిన తోకవున్న కోతులన్నీ ఏమిటి విషయం అని ఆలోచించాయి.కాని కాలం చాల గొప్పది కదా అందువల్ల కొంతకాలానికి తోక వున్న కోతులన్ని ఈ తోకలేని కోతికి తోక సర్టిఫికేటు జారి చెసి వాటితో  తిప్పుకోవడం మొదలెట్టాయి. అలా కోతి దాని తోక అనే ఈ టపా ముగిసింది.ఇందులో ఆ అడవి నవనాగరిక సమాజమని,అటువంటి కోతులు మనలో చాలా వున్నాయని,ఆ తోక ఇంకెదో కాదు మనం పేరు చివర తగిలించుకునే కులం తోక అని ఎవరికైనా అనిపిస్తే అది నా తప్పు కాదు.జరిగిన సంఘటనల మీద సినిమాలు తీసి,ఈ సినిమా కేవలం కల్పితం అని రాసే రాం గోపాల్ వర్మ లాగ ,ఈ టపా కేవలం కల్పితం ఎవరిని వుద్దెసించినది కాదు అని రాయడం తప్ప నేనెమి చేయలేను,సారీ 

No comments:

Post a Comment