Powered By Blogger

Friday, November 4, 2011

శ్వేత సౌధం పై మరో నెత్తుటి మరక

గడాఫీ ని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపారు- - - పేపర్లలోనూ,టి.వి.లలోనూ ఈ న్యూస్ చూసి ,ఫేస్ బుక్ లలో లైక్ లూ,డిస్లైక్ లూ చూసి చూసి నాకు నవ్వలో యేడవాలో అర్థం కావడం లేదు.గడాఫీ కి మనకి యేమాత్రం సంబంధం లేదు కాని మనం విశ్వమానవులం  కాబట్టీ, ప్రపంచంలో మనకి అక్కరలేని సంగతి లేదు కాబట్టి మనం అన్ని విషయాలూ పట్టించుకుంటాం కాబట్టి ఇది కూడా మనకి కావాలి. ఒ.కె బానే వుంది.కాని అమెరికా చంపిన గదాఫీగురించే మనకి కావలి కాని, దానికి  కారణం ఇవెవి మనకి అవసరం లేదు.గడాఫీ నిరంకుశత్వం  వల్ల ఆ దేశ ప్రజాలు ఇలా  చెసి వుంటే  అందులో తప్పుపట్టాల్సిన విషయం యేమి కనబడదు.  కాని అమెరికా కు అక్కడ యెం పని, ప్రపంచంలో ప్రజాస్వమ్యన్ని  పనిగట్టుకు వుద్దరించే అమెరికా కు ఒరిగే లాభం ఏంటి?  
అరబ్ దేశాల  మీద అమెరికాకు   అలవిమాలిన ప్రేమ అక్కడ వున్న ఆయిల్ బావుల మీద.  అందుకే  అక్కడేం జరిగినా,  జరుగుతున్నా  వేరెదేశం   జొక్యం ఎక్కువై తనకి రావల్సిన పేరు దానితో పాటు  ఆయిల్ బావులు పోతాయనిపించిన అమెరికా అక్కడవాలిపోతుంది.  చక్కగ అక్కడ ప్రజస్వామ్యన్ని పునరుద్దరించేస్తుంది. మొన్న చంపిన సద్దాం  గాని ,ఇవల చంపిన గడాఫీ గాని అమెరికా పెంచి పోషించిన వేటకుక్కలు కారా? ఇప్పుడు అమెరికా చెతిని  అవే  వెటకుక్కలు కరిచెసరికి ఎక్కడలేని బాధ్యత గుర్తుకువచ్చెసింది
కొసమెరుపు ఎంటంటే తొటి జీవుల మీద ఎంతో జీవకారుణ్యం  కలిగిన  మనవాళ్ళు తమ పెంపుడు కుక్కల్ని వొళ్ళొకూర్చొపెట్టుకుని,గదాఫీని  అతిదారుణం గా చంపడాన్ని చూసి ఎంత చక్కగా ఆనందించారో   (యూట్యూబుల్లో చూసి) ఇటువంటి దయార్ద్రహ్రుదయులకు జోహార్లు--జ్వాల   

1 comment:

  1. మీ గురించి వివరిస్తూ శ్రీ శ్రీ గారి వాఖ్యలు అద్భుతం...నిజంగా స్వార్ధపరుదిగానే బతకలేమో ఈ సమాజం లో...పొతే మీ టపా....తో నేను అంగీకరిస్తాను .....గడాఫీ నిరంకుసుడే ఐతే ....లిబియా ప్రజల తీర్పు ( ఆయనను చంపడం ) స్వాగతించదగ్గదే .....నిరంకుషులకు గుణ పాఠం కూడా ..... కాని...ఈ అమెరికా ప్రోత్సహించిన రెబల్స్ వాళ్ళ ఐతే మాత్రం...ఆలోచించాల్సిందే.....మీరు రాసిన రాయకపోయినా .....నేను కామెంట్ చేసినా చేయకపోయినా ....అమెరికా ప్రపంచానికి పట్టిన దరిద్రమే.....ఇది సత్యం..

    ReplyDelete