Powered By Blogger

Thursday, May 24, 2012

మనమింతే

గత స్ర్ముతులలోకి ఒక్కసారి చూసుకుంటుంటే చాల థ్రిల్లింగ్ గా వుంటుంది,అన్నీ ఎంతలా మారిపొయాయో అనిపిస్తుంది.మనం చిన్నప్పుడు తొక్కిన సైకిలు కూడా బ్రిటిష్ మ్యూజియంలో అద్భుతంలా అనిపిస్తుంది.
       కాలం ఎంత వేగం గా పరిగెడుతోంది,అప్పుడే కొత్తసంవత్సరంలో 5 నెలలు గడిచిపోయయి.ఇవ్వాళ రేపు అనుకుంటూ నేను బ్లాగు లో రాసి అప్పుడే ఆరు నెలలు!   సమాజంలో త్వరిత గతిన వస్తున్న మార్పులు నాలాంటి వాళ్ళని    అయోమయానికి  గురిచేస్తున్నాయి.   ఇదివరకు  యే సిద్దంతాలైతే  మనకి సీరియస్ గా అనిపించాయో ఇప్పుడు అవే కామెడీగా అనిపిస్తున్నాయి జనాలకి. పెట్రోలు ధరలు పెరిగినప్పుడు దిగువ మధ్యతరగతి వాళ్ళ  పరిస్తితి ఏంటా అనే   ఆలొచనవస్తే నాకే నవ్వుగా అనిపించింది. అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ల   పుణ్యమా  అని సూడో అప్పర్ మిడిల్ క్లాస్ పుట్టుకొచ్చిన  తరువాత యేది ఎంత పెరిగితె ఎవడికి ప్రొబ్లెం?   సంపాదించలేకపొవడం మన అసమర్ధత అని సరిపెట్టుకోవాలి గాని!  హుబ్లి ఎక్స్ ప్రెస్   దేన్ని  గుద్దితే మనకెందుకు,ఎవడెలపొతే మనకెందుకు,మనం బాగ సంపదించగలుగుతున్నామా లేదా,    అందరికి అదె ఇంపొర్టెంట్.అంతా ఒ.కె  కాని,సాఫ్ట్ వేర్  ఇంజినీర్లు లేని కుటుంబాల  మాట,రోజు వారి పనులు చేసుకునేవారి  మాట  యేమిటబ్బ? అయిన నా పిచ్చి గాని,వాళ్ళకి   పచ్చనోటు,చికెన్ బిర్యాని,లిక్కరు,చీరలు,వూర్లో కుర్రకారుకి క్రికెట్  సెట్లు  లేవా  ఎంటి? ఐతే  ఇవి అన్నీ యెన్నికలప్పుడు మధ్య మధ్యలో వీళ్ళకి బోరు కొట్టకుండా రాజకీయ పార్తీల గొడవలు, కులలా గొడవలు,హీరోల గురించి దెబ్బలాడుకోవడాలు,విగ్రహాలు పగలగొట్టడాలు ఇటువంటి ఎంటర్ టైన్మెంట్లు చాలానే వున్నాయి మనకి-జ్వాల 

Monday, November 14, 2011

నీ కోసం

నన్ను నిశీధి వలయంలో వదిలేసి 
ఆశల చట్రంలో బిగించేసి
ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియతమా? 
సముద్రాల అవతలకి
నాజీ నాయకులదగ్గరికి
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలన్నా చూడలేని చోటికి ఎందుకు వెళ్ళిపోయావ్ నేస్తమా? 
నీ అక్షరాలను తడిమి చూస్తున్నప్పుడు
 అవి నా గుండెల్లో శిలాఫలకాలు గా మారి నా గుండె బరువుని పెంచుతున్నాయి.
నీ పెదవుల తడి గుర్తుకొస్తున్నప్పుడు నా పెదవులు తడారిపోతున్నాయి
నీ కళ్ళ చురుకు చూపు స్పురించినపుడు
నా కలలు ఆవిష్కౄతమవుతున్నాయి
నీ ఙ్ఞాపకాల తుఫాను చుట్టుముట్టి నన్ను విధి సంద్రంలో ముంచక మునుపే
నీ పలకరింతల పన్నీరు జల్లు ప్రళయమై నన్ను చంపకమునుపే   
నీ కౌగిలిలోకి నన్ను తీసుకుని
నీ పయ్యదపై నన్ను చేర్చుకుని
రక్షించవా ప్రియతమా
నీకోసం ఇక్కడే ఎదురు చూస్తాను
నీవు రాకపోతే కాలపు కర్కశత్వానికి కాష్ఠమై కాలిపోతాను

ప్రియాంక కి ఆరాధనతో..................................................జ్వాల

Friday, November 4, 2011

శ్వేత సౌధం పై మరో నెత్తుటి మరక

గడాఫీ ని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపారు- - - పేపర్లలోనూ,టి.వి.లలోనూ ఈ న్యూస్ చూసి ,ఫేస్ బుక్ లలో లైక్ లూ,డిస్లైక్ లూ చూసి చూసి నాకు నవ్వలో యేడవాలో అర్థం కావడం లేదు.గడాఫీ కి మనకి యేమాత్రం సంబంధం లేదు కాని మనం విశ్వమానవులం  కాబట్టీ, ప్రపంచంలో మనకి అక్కరలేని సంగతి లేదు కాబట్టి మనం అన్ని విషయాలూ పట్టించుకుంటాం కాబట్టి ఇది కూడా మనకి కావాలి. ఒ.కె బానే వుంది.కాని అమెరికా చంపిన గదాఫీగురించే మనకి కావలి కాని, దానికి  కారణం ఇవెవి మనకి అవసరం లేదు.గడాఫీ నిరంకుశత్వం  వల్ల ఆ దేశ ప్రజాలు ఇలా  చెసి వుంటే  అందులో తప్పుపట్టాల్సిన విషయం యేమి కనబడదు.  కాని అమెరికా కు అక్కడ యెం పని, ప్రపంచంలో ప్రజాస్వమ్యన్ని  పనిగట్టుకు వుద్దరించే అమెరికా కు ఒరిగే లాభం ఏంటి?  
అరబ్ దేశాల  మీద అమెరికాకు   అలవిమాలిన ప్రేమ అక్కడ వున్న ఆయిల్ బావుల మీద.  అందుకే  అక్కడేం జరిగినా,  జరుగుతున్నా  వేరెదేశం   జొక్యం ఎక్కువై తనకి రావల్సిన పేరు దానితో పాటు  ఆయిల్ బావులు పోతాయనిపించిన అమెరికా అక్కడవాలిపోతుంది.  చక్కగ అక్కడ ప్రజస్వామ్యన్ని పునరుద్దరించేస్తుంది. మొన్న చంపిన సద్దాం  గాని ,ఇవల చంపిన గడాఫీ గాని అమెరికా పెంచి పోషించిన వేటకుక్కలు కారా? ఇప్పుడు అమెరికా చెతిని  అవే  వెటకుక్కలు కరిచెసరికి ఎక్కడలేని బాధ్యత గుర్తుకువచ్చెసింది
కొసమెరుపు ఎంటంటే తొటి జీవుల మీద ఎంతో జీవకారుణ్యం  కలిగిన  మనవాళ్ళు తమ పెంపుడు కుక్కల్ని వొళ్ళొకూర్చొపెట్టుకుని,గదాఫీని  అతిదారుణం గా చంపడాన్ని చూసి ఎంత చక్కగా ఆనందించారో   (యూట్యూబుల్లో చూసి) ఇటువంటి దయార్ద్రహ్రుదయులకు జోహార్లు--జ్వాల   

Sunday, September 11, 2011

సిరివెన్నెల

సిరివెన్నెల మూవీ పై నవతరంగం లో నేను రాసిన సమీక్ష

http://navatarangam.com/2011/09/kv-sirivennela/

Wednesday, September 7, 2011

"కోతి మరియు దాని తోక"

అనగనగా ఒక అడవి.అడవన్నాక కోతులుంటాయి కదా.కోతులూ వుంతాయి,కొండముచ్చులూ వుంటాయి,చింపాజీ లూ వుంటాయి.ఇలా వున్న ఆ అడవిలోకి ఒకసారి పక్క అడవినుంచి ఓ కోతి వచ్చింది.ఈ అడవిలోని కోతుల్ని చూసి అది చాలా బాధపడిపోయింది.ఈర్ష్య పడిపోయింది.దేవుడు దానికేదొ పెద్ద అపకారం చేసినట్టు ఫీలై పోయింది.ఇంతకీ దాని అసూయకి ,బాధకి కారణం ఏమిటంటే ఈ అడవిలో కోతులకి తోకలున్నాయి,దీనికి లేదు.అందులోనూ అవి మామూలు తోకలా పెద్ద పెద్ద తోకలు ,బలమైన తోకలు,ఇంపైన తోకలు.దెబ్బతో దానికి దేవుడి మీద చాల కోపం వచ్చింది నిలబెట్టి కడిగేయలనుకుంది,దేవుడున్నడా అనుకుంది వుంటె చూస్తున్నాడా అనుకుంది(ఈ దేవుడు డైలాగులన్ని నావి కాదందోయ్,మీకు ఈ డౌటు వచ్చిందంటే మీరు ఈ మధ్య తెలుగు పేపర్లు చదవడం లేదనే లెక్క!) కాని దేవుడు,  మిడిల్ క్లాస్ మనిషికి సొంతింటి కల లాగా అందని విషయం కాబట్టి ఆ ప్రయత్నం మానుకుని తనే సొంతం గా ఆలోచించడం మొదలెట్టింది.ఎంతయినా కోతి తెలివితేటలు కదా! అడవంతా కలియతిరిగి కొన్ని ఆకులు మరికొన్ని వేళ్ళూ తెచ్చుకుని తనే ఒక తోక అల్లుకుంది.తుమ్మ జిగురో మరి ఇంకోటేదో తెచ్చుకుని(మరదే! అలా చూస్తారేంటి,అడవిలో ఫెవికాల్ దొరకుద్దా?) దాని వెనకాల అతికించుకుంది (వెనకాలంటె  ఎక్కడో మీకు తెలుసు ఎందుకంటే మీరు కూడా ఆంధ్ర ప్రదేశ్ జనాల లాగా ఇంటెలిజెంట్స్ అని నాకు తెలుసు.చంద్రబాబు గారి ఆస్తులు 39 కోట్లంటె తలక్కయలు వూపేసిన వాళ్ళూ ఇంటెలిగెంట్స్ కాక మరేంటి).సున్నమో, బూడిదో తెచ్చుకుని తోకకు పాముకుని అదినిజమైన తోకలా కనబడ్డానికి ట్రై చేసింది.దానికి వచ్చిన కొత్త తోకని చూసుకుని మురిసిపోయింది.ఊర్లో వీర విహారానికి బయల్దేరింది.కనబడిన ప్రతీ దానికి దీని తోకని చూపించడం మొదలెట్టింది.నిజం గా తోకలున్న కోతులు ఎప్పటిలానె మాములుగా వుంటె ఇదిమాత్రం దాని ముఖానికన్న ముందు గా దాని తోకని చూపించుకుంటూ తిరగసాగింది.కాని అది నేచురల్ గా వున్న తోక కాదు కబట్టి,అది కూడ అంతే నేచురల్ గా నాలుగు కోతుల మధ్య ఇది గంతులేస్తున్నప్పుడు వూడిపోయింది.దాంతో ఈ కోతికి మొహం చెల్లలేదు. ఎక్కదికైనా ఈ తోకలకి దూరం గా వెళ్ళీపోయి ప్రశాంతం గా బతకాలనుకుంది ఫ్యాక్షన్ సినిమాలో హీరో లాగ.కాని తోక వుంటే వుండే మజా నే వేరు.దానికి అడవిలో దొరికే గౌరవమే వేరు.అందుకే దీనికి పరిష్కారం  ఒక్కతే అనుకుని ఎక్కడపడితే అక్కడ చెట్టుల మీద ,పుట్టల మీదా "నాకు తోక వుంది" అని రాయడం మొదలుపెట్టింది. మిగిలిన తోకవున్న కోతులన్నీ ఏమిటి విషయం అని ఆలోచించాయి.కాని కాలం చాల గొప్పది కదా అందువల్ల కొంతకాలానికి తోక వున్న కోతులన్ని ఈ తోకలేని కోతికి తోక సర్టిఫికేటు జారి చెసి వాటితో  తిప్పుకోవడం మొదలెట్టాయి. అలా కోతి దాని తోక అనే ఈ టపా ముగిసింది.ఇందులో ఆ అడవి నవనాగరిక సమాజమని,అటువంటి కోతులు మనలో చాలా వున్నాయని,ఆ తోక ఇంకెదో కాదు మనం పేరు చివర తగిలించుకునే కులం తోక అని ఎవరికైనా అనిపిస్తే అది నా తప్పు కాదు.జరిగిన సంఘటనల మీద సినిమాలు తీసి,ఈ సినిమా కేవలం కల్పితం అని రాసే రాం గోపాల్ వర్మ లాగ ,ఈ టపా కేవలం కల్పితం ఎవరిని వుద్దెసించినది కాదు అని రాయడం తప్ప నేనెమి చేయలేను,సారీ